తెలంగాణ

telangana

కొవిడ్‌పై కలెక్టర్లు, అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

By

Published : Dec 1, 2021, 10:38 AM IST

Updated : Dec 1, 2021, 11:57 AM IST

telugu news telangana Cabinet sub-committee meeting with collectors and officials on Covid pandemic
కొవిడ్‌పై కలెక్టర్లు, అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

10:36 December 01

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, సన్నద్ధత, వ్యాక్సినేషన్‌పై సమీక్ష

Minister harish rao review on covid: రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, సన్నద్ధత, వ్యాక్సినేషన్‌పై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. దృశ్య మాధ్యమం ద్వారా అధికారులతో మంత్రి హరీశ్​ రావు సమీక్షిస్తున్నారు. సమీక్షలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్​ రావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

government focus on new variant: ఒమిక్రాన్​పై ప్రభుత్వం అప్రమత్తం.. వారికి పరీక్షలు తప్పనిసరి

ఉపసంఘం సమావేశం

Sub committee on covid variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అప్రమత్తతపై దృష్టి సారించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమైంది. నియంత్రణా చర్యలతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేయనుంది. అటు కరోనా నియంత్రణా చర్యలతో పాటు వ్యాక్సినేషన్​పై వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్​ రావు నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పురపాలక, పంచాయతీరాజ్, విద్యాశాఖల మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిలను సభ్యులుగా నియమించారు.

అన్ని రకాలుగా సిద్ధం

సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరోనా పరిస్థితులు, వైద్య-ఆరోగ్యశాఖ సన్నద్ధతపై సమీక్షించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్, రాష్ట్రంలో పరిస్థితులపై కేబినెట్​కు నివేదించిన వైద్య,ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అవసరమైన ఔషధాలు, పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖను కేబినెట్ ఆదేశించింది. అందుకు అనుగుణంగా వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. పడకలు, ఔషధాలు, పరికరాలతో పాటు మానవవనరులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు తెలిపింది.

ఆంక్షలున్నాయి: డీహెచ్​

Covid new variant omicron:ఒమిక్రాన్‌పై ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మెుద్దని ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు కోరారు. దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ రాలేదన్న ఆయన.. కొత్త కేసులు వస్తే ప్రభుత్వమే నేరుగా ప్రకటిస్తుందని చెప్పారు. 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. ఒమిక్రాన్‌కి వేగంగా వ్యాపించే గుణం ఉందని.. వైరస్‌ తీవ్రత తక్కువగా ఉందని తెలిపారు. ఒమిక్రాన్‌ బాధితుల్లో లక్షణాలు తలనొప్పి, అధిక నీరసం ఉంటాయని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచించారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని ప్రతి ఒక్కరు టీకాలు వేయిచుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:Covid death compensation: పరిహారం దూరం.. ఆ కుటుంబాల్లో అయోమయం.!

Last Updated : Dec 1, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details