Revanth reddy on KCR: రైతులు పండించే ప్రతి ధాన్యం గింజా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేసినా చేయకపోయినా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులు పండించే 23 పంటలకూ కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేసేది లేదని చెప్పినప్పుడు కేసీఆర్.. ఆయన ఫామ్ హౌజ్లో 150 ఎకరాల్లో వరి ఎలా పండిస్తున్నారని ప్రశ్నించారు. ఆ వడ్లను ఎవరు కొంటారని నిలదీశారు. వరి వేస్తే ఉరే అని రైతులను హెచ్చరించి.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా వరి వేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. రేపు ఎర్రవల్లిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో... ముఖ్యమంత్రి కేసీఆర్ వరి పొలం కూడా చూపిస్తానని రేవంత్ అన్నారు.
ప్రచారమే.. పరిహారం లేదు..
మూడు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రచార ఆర్భాటాలు తప్ప రైతుల గోస పట్టడం లేదని ధ్వజమెత్తారు. రైతు చట్టాలపై పోరాడి మృతి చెందిన 700 మంది రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటి వరకూ నయాపైసా ఇవ్వలేదని ఆరోపించారు. కనీసం రైతుల వివరాలు కూడా తెలుసుకోలేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దాసోహమైందని.. సాగుచట్టాలను తీసుకొచ్చి రైతుల హక్కులను కాలరాసిందని ధ్వజమెత్తారు. ఉత్తరాదిలో ఎన్నికలకు భయపడి రైతులకు క్షమాపణ చెప్పి, ఆ నల్ల చట్టాలను మోదీ రద్దు చేశారని ఆరోపించారు. సాగుచట్టాలు తిరిగి తీసుకొస్తామని కేంద్ర మంత్రి తోమర్ అన్నారన్న రేవంత్ రెడ్డి.. మళ్లా సాగు చట్టాలు తీసుకొస్తే తెరాస సర్కారు ఎటువైపు ఉంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎగుమతి చేయొచ్చు..