Shaikpet Flyover Opening: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా గణనీయమైన పురోగతి సాధించామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం కింద పెద్దఎత్తున రహదారుల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. నూతన సంవత్సరం కానుకగా షేక్‌పేట్ పైవంతెనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
హైదరాబాద్‌కు పోటీ లేదు
KTR speech at shaikpet flyover inauguration: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రోడ్ల నిర్మాణం జరిగిందని కేటీఆర్ అన్నారు. ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్న మంత్రి.. ఆరు వేల కోట్లకుపైగా నిధులతో నిర్మాణాలు చేపట్టామని వివరించారు. నగరంలో పెద్దఎత్తున లింక్ రోడ్లు నిర్మించామని.. రీజినల్ రింగ్‌రోడ్‌ను కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ పూర్తయితే దేశంలో ఏ నగరం కూడా హైదరాబాద్‌కు పోటీ రాదని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు 4వ అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఉందని మంత్రి అన్నారు. ఈమేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ పలు విజ్ఞప్తులు చేశారు.
ఆ రోడ్లను తెరిపించాలి