Kodandaram on TRS: రాష్ట్రంలో భూసేకరణపై ప్రభుత్వం అత్యంత దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. నిజాం కాలంనాటి రోజులను గుర్తుచేసేలా భూములు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో భూ నిర్వాసితుల దీక్షకు కోదండరాం మద్దతు తెలిపారు. సర్కారు బలవంతపు భూసేకరణ ఆపాలని కోదండరాం డిమాండ్ చేశారు.
'ప్రభుత్వమే భూ కబ్జాదారు'
'అసైన్డ్ భూముల విషయంలో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడి.. అక్రమంగా లాక్కుంటున్నారు. చిన్న చిన్న లీగల్ సమస్యలను అడ్డం పెట్టుకుని.. అంతో ఇంతో ఇచ్చి భూమిని గుంజుకుంటున్నారు. ప్రభుత్వమే భూ కబ్జాదారుగా అవతారమెత్తింది.