Amit shah meeting: తెలంగాణ భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా రెండు రోజుల్లో సమావేశం కానున్నారు. ఈ మేరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సిద్ధంగా ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు.. అమిత్ షా కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వరి ధాన్యంపై తెరాస వైఖరి, ప్రజా సంగ్రామ యాత్ర, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Amit shah meeting: రాష్ట్ర భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో అమిత్ షా భేటీ.. ఆ అంశాలపై చర్చ - telangana bjp leaders
Amit shah meeting: కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాష్ట్ర భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో రెండు రోజుల్లో దిల్లీలో భేటీ కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, వరి ధాన్యంపై తెరాస ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై చర్చ సాగనున్నట్లు సమాచారం.
అమిత్ షా