తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay on job notifications: 'ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు అంటూ సీఎం​ ఊదరగొడతారు'

Bandi Sanjay on job notifications: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్​కు నోటిఫికేషన్లు గుర్తుకువస్తాయని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా జీవో 317 ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు.

bandi sanjay on job notifications
ఉద్యోగ నోటిఫికేషన్లపై బండి సంజయ్​

By

Published : Dec 18, 2021, 1:17 PM IST

నోటిఫికేషన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన: సంజయ్

Bandi Sanjay on job notifications: ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. ఇప్పటికే 20 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్​పీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారని.. వారంతా ఏం చేయాలని సీఎం కేసీఆర్​ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ మేరకు నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంజయ్​ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

డిగ్రీలు, పీజీలు చదివి ఎంతోమంది ఖాళీగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్​.. ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు అంటూ ఊదరగొడతారు. ఆయన లాకర్లలో కొన్ని విషయాలు పెట్టుకుంటారు. పాత సమస్యపై ఆందోళనలు చేస్తే కొత్త సమస్యను తెరపైకి తెస్తారు. రాష్ట్రపతి జారీ చేసిన జీవో 124 ను ఇంతవరకూ కేసీఆర్​ ఎందుకు అమలు చేయలేదు.? జీవో 317 తో నిరుద్యోగులంతా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఆ జోవో సాకుతో

Bandi sanjay fired on cm kcr: ఓ వైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బండి సంజయ్​ దుయ్యబట్టారు. సమస్యలను పరిష్కరించాల్సిన సీఎం.. సమస్యలను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై స్పష్టత ఇచ్చేవరకు ఊరుకోబోమని హెచ్చరించారు. నిరుద్యోగ భృతి హామీని విస్మరించారని.. కొత్తగా జీవో 317 ఎందుకు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ జోవో సాకుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి జారీ చేసిన జీవో 124 ఉత్తర్వులను ఇంతవరకూ ఎందుకు అమలు చేయలేదని బండి సంజయ్​ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:Bandi Sanjay on Students Suicide : 'సర్కార్ తప్పు వల్లే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు'

ABOUT THE AUTHOR

...view details