Stunts on bike in hyderabad: ట్రాఫిక్ లేని రోడ్లపై స్టంట్లు చేస్తే ఏం కిక్కు ఉంటుంది అనుకున్నాడో ఏమో.. ఈ యువకుడు ఏకంగా హైదరాబాద్ రోడ్లపై విన్యాసాలు ప్రదర్శించాడు. అసలే ఎస్ఆర్నగర్ రోడ్డు.. దాదాపు 20 గంటలు వాహనదారులు, ప్రయాణికులతో బిజీగా ఉండే రహదారులు. కనీస వేగంతోనే వాహనదారులు ఆచితూచి నడుపుతుంటారు. అలాంటిది అతివేగంతో బండి నడుపుతూ బైక్‌తో విన్యాసాలు చేశాడు ఈ యువకుడు. కాసేపు రోడ్డుపై ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఎస్ఆర్ నగర్ నుంచి వెంగళరావు నగర్ వెళ్లే దారిలో ఈ యువకుడు చేసిన స్టంట్లు ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి.
Stunts on bike in hyderabad: రోడ్డుపై యువకుడి స్టంట్లు.. మరిచాడేమో ట్రాఫిక్ రూల్సూ.! - young man stunts on sr nagar roads
Stunts on bike in hyderabad: కుర్రాళ్లకు బైక్ ఇవ్వాలంటే తల్లిదండ్రులే కాదు.. తెలిసిన వాళ్లు కూడా భయపడతారు. అసలే ఉడుకు రక్తం, తొందరపాటు.. ముఖ్యంగా బైక్‌పై ఉన్న మోజు.. ఆ మోజులో పడి.. చేతికి బండి చిక్కిందంటే చాలు.. విన్యాసాలు చేస్తుంటారు. అందరి కళ్లూ తమ వైపే ఉండాలనుకుంటారు. కానీ స్టంట్లు చేసే క్రమంలో కిందపడతామన్న భయం.. చేస్తున్నప్పుడు రోడ్డుపై వాహనదారులు ఇబ్బందులు పడతారనే విషయాన్ని గమనించకుండా కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఆ కోవకు చెందిన వాడే ఈ వీడియోలో కనిపించే యువకుడు. తన చిత్రవిచిత్రమైన విన్యాసాలతో కాసేపు అక్కడున్న వారిని హడలెత్తించాడు.
బైక్‌పై యువకుడి ఫీట్లు
తాను వెళ్తున్న రోడ్డుపై వాహనాలు, పాదచారుల రద్దీ ఉన్నప్పటికీ ఆ యువకుడు ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడిపాడు. అంతే కాకుండా బైక్‌ను కిందకు పైకి లేపుతూ స్టంట్స్ చేశాడు. కాసేపు అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ తోటి వాహనదారులను గందరగోళానికి గురిచేశాడు. యువకుడి ప్రవర్తనతో వాహనదారులు బెంబేలెత్తారు. తమనెక్కడ ఢీకొంటాడోననే భయంతో పాదచారులు వణికిపోయారు.
ఇదీ చదవండి:రేసింగ్‌లో దుమ్మురేపుతున్న చిన్నారులు...