లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న 14 వేల మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఇంతమందిని ఆదుకున్న ఆయనను దేవుడెప్పుడూ చల్లగా చూస్తారని తెలిపారు.
మంత్రి తలసానికి ధన్యవాదాలు తెలిపిన తెలుగు సినీ పరిశ్రమ - మంత్రి తలసానికి ధన్యవాదాలు తెలిపిన తెలుగు సినీ పరిశ్రమ
లాక్డౌన్ సమయంలో సినీ పరిశ్రమలోని పేద ప్రజలకు మంత్రి తలసాని నిత్యావసర సరుకులు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు.
![మంత్రి తలసానికి ధన్యవాదాలు తెలిపిన తెలుగు సినీ పరిశ్రమ telugu cine film industry say thanks to minister talasani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7406542-1076-7406542-1590828266948.jpg)
మంత్రి తలసానికి ధన్యవాదాలు తెలిపిన తెలుగు సినీ పరిశ్రమ
వెస్ట్ మారేడ్‌పల్లిలోని మంత్రి నివాసానికి వెళ్లి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోమర వెంకటేశ్, పీఎస్ఎన్ దొర, మనం సైతం కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నాారు.
ఇవీ చూడండి:తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు