తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్‌జీ పాలిమర్స్‌ మృతుల కుటుంబాలకు తెదేపా సాయం - ఎల్జీ పాలిమర్స్ వార్తలు

ఏపీలోని విశాఖ జిల్లా ఎల్​‌జీ పాలిమర్స్‌ స్టైరీన్‌ లీకేజీ ఘటనలో మృతి చెందిన 15 మంది కుటుంబాలకు పార్టీ తరపున రూ.50 వేల చొప్పున సాయం అందించాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించారు. ఆర్థిక సాయాన్ని సోమవారం బాధిత కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని చెప్పారు.

ఎల్‌జీ పాలిమర్స్‌ మృతుల కుటుంబాలకు తెదేపా సాయం
ఎల్‌జీ పాలిమర్స్‌ మృతుల కుటుంబాలకు తెదేపా సాయం

By

Published : Jun 15, 2020, 11:11 AM IST

ఏపీ లోని విశాఖ జిల్లాలో ఎల్​​జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. దుర్ఘటనలో 15 మంది మృతి చెందడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా పరామర్శించడానికి రావాలనుకున్నా.. వైకాపా ప్రభుత్వం సహకరించలేదని తెలిపారు. వందలమంది ఆస్పత్రులలో చికిత్స పొందడం చూసి చలించిపోయానన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, అస్వస్థతకు గురైన బాధితులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పాలని పార్టీ నేతలకు సూచించారు. తెదేపా ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పార్టీ నాయకులు మృతుల కుటుంబాలను నేరుగా కలిసి ఆర్థిక సాయానికి సంబంధించి చంద్రబాబు రాసిన లేఖను అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details