తెలంగాణ

telangana

ETV Bharat / state

Kasani Gnaneshwar: తెదేపా తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ - కాసాని జ్ఞానేశ్వర్‌

Telangana TDP New President: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్​ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన జ్ఞానేశ్వర్ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు.

Telugu Desam Party New President in Telangana
తెదేపా తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌

By

Published : Nov 4, 2022, 8:45 PM IST

Telangana TDP New President: తెలుగుదేశం పార్టీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్​ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన జ్ఞానేశ్వర్ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. ఇటీవల చంద్రబాబు ఆధ్వర్యంలో జ్ఞానేశ్వర్ సైకిలెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులుకు పొలిట్‌ బ్యూరోలో స్థానం కల్పించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నర్సింహులును నియమిస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

కాసాని జ్ఞానేశ్వర్​ను తెలంగాణ తెదేపా నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ పత్రికా ప్రకటన విడుదల

ABOUT THE AUTHOR

...view details