ప్రముఖ సినీనటి గీతాంజలి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలోని విద్యుత్ వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఉదయం గుండెపోటుతో మృతిచెందిన ఆమె పార్థీవదేహాన్ని నందినగర్‌లోని నివాసం నుంచి అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్‌తోపాటు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, శివాజీరాజా, రమాప్రభ, ఉత్తేజ్, బాబుమోహన్, అన్నపూర్ణ, ప్రభ, కవిత సహా తదితర నటీనటులు, పలువురు అభిమానులు చాంబర్‌కు చేరుకొని గీతాంజలి భౌతికకాయానికి నివాళులర్పించారు. చిత్రపరిశ్రమలో గీతాంజలి చేసి సేవలను గుర్తుచేసుకొని కన్నీంటి పర్యంతమయ్యారు. గీతాంజలి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నటుడు బాలకృష్ణ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.
సినీనటి గీతాంజలికి కన్నీటి వీడ్కోలు - geetanjali passed away
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సీనియర్ నటి గీతాంజలి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలోని విద్యుత్ వాటికలో కుటుంబసభ్యులు గీతాంజలికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ముగిసిన సినీనటి గీతాంజలి అంత్యక్రియలు