టెలిమెడిసిన్ (Telemedicine) ప్రాధాన్యం కరోనా కాలంలో తెలిసొచ్చింది. కరోనా లాక్డౌన్ (Corona Lockdown) సమయంలో తక్కువ, మధ్యస్థ కొవిడ్ లక్షణాలు ఉన్న వారు ఎంతోమంది ఇంట్లోనే ఉంటూ టెలిమెడిసిన్ (Telemedicine) ద్వారా కోలుకున్నారు. రెండో విడతలో రోగుల సంఖ్య భారీగా పెరగడంతో ఆసుపత్రులన్ని కిటకిటలాడాయి. ‘గాంధీ’లో 650 ఐసీయూ పడకలు అందుబాటులోకి తెచ్చారు. మరో వేయి ఆక్సిజన్ పడకలు సిద్ధం చేశారు. అవన్నీ రోగులతో నిండిపోవడంతో రోగులకు నిరీక్షణ తప్పలేదు.
ఉచితంగా సేవలందించి..
నగరానికి చెందిన ‘హెల్పింగ్ హ్యాండ్ (Helping Hand)’ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో టెలిమెడిసిన్ (Telemedicine)పై ఆధారపడి దాదాపు 98-99 శాతం మంది కోలుకున్నట్లు తేల్చారు. కరోనా కాలంలో ఈ సంస్థ ఉచితంగా సేవలను అందుబాటులోకి తెచ్చింది. 18 మంది వైద్యులు, కౌన్సిలర్లను ఏర్పాటు చేసింది. ఐవీఆర్ సాంకేతికత ద్వారా కొవిడ్ సోకిన రోగులకు టెలిమెడిసిన్ (Telemedicine) సేవలు అందించారు. దాదాపు 7,078 మందికి మే 15 నుంచి జూన్ 31 వరకు ఈ సేవలు అందించారు. వారిలో జ్వరం, దగ్గు, జలుబుతో పాటు వాసన, రుచి కోల్పోయిన వారే ఎక్కువ. 45 ఏళ్లు ఆపైనే దాటిన చాలా తక్కువ మంది మాత్రం శ్వాస సమస్య తలెత్తడంతో దవాఖానాల్లో చేరారు.