తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో కొవిడ్​ బాధితుల కోసం టెలీమెడిసిన్​ కన్సల్టేషన్​ సెంటర్​ - హైదరాబాద్​ వార్తలు

సైబరాబాద్​ పోలీస్​​, ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో హైదరాబాద్​ ప్రజలకోసం కొవిడ్​ టెలీ మెడిసిన్​ కన్సల్టేషన్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొవిడ్​ మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ప్రజలకు తమవంతు సాయం చేయాలనే సంకల్పంతో ఈ సేవలను ప్రారంభించారు.

తెలంగాలో కరోనా కేసులు
సైబరాబాద్​ పోలీస్​ వార్తలు

By

Published : Apr 28, 2021, 6:45 AM IST

హైదరాబాద్​ ప్రజల కోసం సైబరాబాద్​ పోలీస్​​, ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో కొవిడ్​ టెలీ మెడిసిన్​ కన్సల్టేషన్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు. కరోనా రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలపై వీడియో కాన్ఫరెన్స్​ల ద్వారా సలహాలు, సందేహాలు నివృత్తి చేస్తున్నారు.

ఎస్సీఎస్సీ సభ్యులు డాక్టర్ రాజీవ్ నేతృత్వంలో కొవిడ్​ బాధితులకు సూచనలు ఇస్తున్నారు. ఈ కాల్​ సెంటర్​లో కాంటినెంటర్​, సన్​షైన్​, సహ పలు ఆస్పత్రులకు చెందిన సుమారు 22మంది వైద్యులు అందుబాటులో ఉంటూ సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఎవరికైనా కొవిడ్​ లక్షణాలు కనిపిస్తే ఈ కాల్​సెంటర్​కు ఫోన్​చేసి వైద్యుల సూచనలు తీసుకోవచ్చని సైబరాబాద్ సీపీ సజ్జనార్​ తెలిపారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి టీకాలెలా..? ఆరోగ్యశాఖ తర్జన భర్జన..!

ABOUT THE AUTHOR

...view details