Lung transplant surgery : హైదరాబాద్ నిమ్స్‌లో 19ఏళ్ల యువతికి లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయనున్నారు. బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ (47) నుంచి సేకరించిన లంగ్స్‌ను యువతికి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నారు. అందుకోసం మెడికోవర్ ఆస్పత్రి నుంచి నిమ్స్ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.
Lung transplant surgery: నిమ్స్‌లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స - నిమ్స్ ఆస్పత్రి వార్తలు
Lung transplant surgery : నిమ్స్‌లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారు. బ్రెయిన్‌డెడ్ అయిన ఓ మహిళ నుంచి సేకరించిన లంగ్స్‌ను 19 ఏళ్ల యువతికి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నారు. మెడికోవర్ ఆస్పత్రి నుంచి నిమ్స్ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ఊపిరితిత్తులను తరలించారు.
nims
medicover hospital: ఈనెల 27న జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశీల (47) గాయపడింది. చికిత్స నిమిత్తం ఆమెను మెడికోవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావడంతో గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:స్వచ్ఛతకు కొత్త మార్గం.. ఈ యంత్రంతో చెత్తను తొలగిద్దాం.!