National Awards for SC Railway: సహజ ఇంధన పరిరక్షణ, అందుబాటులో ఉన్న ఇంధన వనరులను సమర్థంగా వినియోగించినందుకు దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. భారత బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ, విద్యుత్ మంత్రిత్వశాఖ అవార్డులను ప్రకటించింది. 2021కి గాను పలు కేటగిరీల్లో నాలుగు అవార్డులను దక్షిణ మధ్య రైల్వే సాధించింది. భవనాల కేటగిరిలో ఆసుపత్రుల విభాగం కింద విజయవాడ డివిజినల్ రైల్వే ఆసుపత్రి మొదటి బహుమతి సాధించింది.
National Awards for SC Railway: దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు - National Awards for SC Railway
Awards for SC Railway: సౌత్ సెంట్రల్ రైల్వేను జాతీయ పురస్కారాలు వరించాయి. ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ పురస్కారాలు వచ్చాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, విద్యుత్ శాఖ సంయుక్తంగా ఈ అవార్డులను ప్రకటించాయి.
![National Awards for SC Railway: దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు National Awards for SC Railway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13847167-841-13847167-1638934568480.jpg)
National Awards for SC Railway
సంస్థల కేటగిరిలో కాచిగూడ స్టేషన్ చారిత్రక కట్టడానికి మొదటి బహుమతి దక్కింది. సంస్థల కేటగిరిలో విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ రెండో బహుమతి సాధించింది. సంస్థల కేటగిరిలో సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయ భవనం ‘సంచాలన్ భవన్’కు మెరిట్ సర్టిఫికెట్ లభించింది. ఈనెల 14 నుంచి 21 వరకు జరిగే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అవార్డులను అందజేయనున్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించడంలో కృషి చేసిన అధికారును దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు.