dangerous auto journey: ఏళ్లు గడుస్తున్నా.. గ్రామీణ విద్యార్థుల బడి కష్టాలు తీరడం లేదు. కిలో మీటర్లు నడిస్తే గానీ బడికి చేరుకోలేకపోతున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు సరైన దారులు లేకపోవడం.. ఉన్న మార్గాల్లో బస్సు సదుపాయం లేకపోవడంతో వారి కష్టాలు తీరడం లేదు. ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. 40 మంది విద్యార్థులు ఉదయాన్నే 4 కిలోమీటర్ల దూరంలోని బడికి వెళ్లాలి. కానీ బస్సు మధ్యాహ్నం వస్తుంది. దీంతో చేసేది లేక.. హాల్వి ఉన్నత పాఠశాలకు కొందరు... కాలినడకన వెళ్తుండగా, మరికొందరు ప్రమాదకరంగా ఆటోపైన ఎక్కి వెళ్తున్నారు.
dangerous auto journey : ఓరి నాయనో...! ఇది ఆటోనా లేక సిటీ బస్సా...? - కర్నూలు వార్తలు
dangerous auto journey: సరైన రవాణా లేక విద్యార్థుల చదువులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కిలో మీటర్లు నడిస్తే గానీ.. పాఠశాలకు చేరుకోలేని దుస్థితి. ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో ఇదీ పరిస్థితి. బస్సు ఉన్నా.. అది మధ్యాహ్నం వస్తుండటంతో విద్యార్థులు ప్రమాదకరంగా ఆటోల్లో కూర్చుని ప్రయాణిస్తున్నారు.
dangerous auto journey
transportation problems: ప్రతిరోజూ ఇదేవిధంగా ప్రయాణిస్తుండటంతో ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులు పాఠశాల సమయానికి అనుకూలంగా బస్సులు ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:hyderabad paper girls: హైదరాబాదీ పేపర్ గర్ల్స్ కథ విన్నారా..!