ap weather updates: ఏపీ ఉత్తరాంధ్ర పరిసర జిల్లాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 4 నాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశముంది. డిసెంబర్ 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతోపాటు.. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ap weather updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..!
ap weather updates: దక్షిణ థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ ఉత్తరాంధ్ర పరిసర జిల్లాల్లో 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
heavy rains in ap: దక్షిణ ధాయ్‌లాండ్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. శుక్రవారం (డిసెంబర్ 3) బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. తర్వాత ఇది వాయువ్య దిశగా ప్రయాణించి.. మరింత బలపడుతూ నాలుగో తేదీ నాటికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలను చేరే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.
ఇదీ చూడండి:paddy procurement: నెలల తరబడి పడిగాపులే.. కర్షకులకు తప్పని కన్నీరు