తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా రిస్క్‌ స్థాయి ఇలా చెక్‌ చేసుకోండిలా..! - కరోనా రిస్క్‌ స్థాయి ఇలా చెక్‌ చేసుకోండిలా..!

కరోనా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ తమకూ ఆ వైరస్‌ సోకిందేమోనన్న అననుమానం కొందరిలో కలుగుతోంది. సాధారణంగా వచ్చే జలుబును కూడా కొందరు తీవ్రంగా పరిగణిస్తూ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారు తమకు ఎంత రిస్క్‌ ఉందో తెలుసుకునేందుకు ప్రముఖ టెలికాం సంస్థలు రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ సెల్ఫ్‌ డయాగ్నోసిస్‌ టూల్స్‌ను తీసుకొచ్చాయి.

telecom operators introduce tools for know corona rick factor
కరోనా రిస్క్‌ స్థాయి ఇలా చెక్‌ చేసుకోండిలా..!

By

Published : Apr 6, 2020, 6:42 PM IST

మీ ఆరోగ్య స్థితి, ప్రయాణ చరిత్ర, ఇతరత్రా వివరాలను బట్టి కరోనా వైరస్‌ రిస్క్‌ను అంచనా వేస్తూ తగిన సూచనలు ఇచ్చేందుకు జియో, ఎయిర్‌టెల్‌ సెల్ఫ్‌ డయాగ్నోసిస్‌ టూల్స్‌ను తీసుకొచ్చాయి. కరోనాపై పోరులో భాగంగా ఈ టూల్స్‌ను ఈ రెండు సంస్థలు ప్రజలకు అందుబాటులో ఉంచాయి. రిలయన్స్‌ జియో తీసుకొచ్చిన ఈ టూల్‌ ‘మై జియో’ యాప్‌లో అందుబాటులో ఉంది.

దగ్గర్లోని ల్యాబ్‌ల వివరాలు

ఓ ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ (https://covid.bhaarat.ai/)ను కూడా రూపొందించింది. గతంలో పాజిటివ్‌ ఉన్న వ్యక్తిని మీరు కలిశారా? ప్రయాణాలు చేశారా? మీకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలకు మీరిచ్చే సమాధానం ఆధారంగా ఫలితాలను ఈ టూల్‌ వెల్లడిస్తోంది. మీ రిస్క్‌ స్థాయిని చెప్పడంతో పాటు దగ్గర్లోని ల్యాబ్‌ల వివరాలు, ప్రపంచ వ్యాప్తంగా కేసులకు సంబంధించిన గణంకాలను అందిస్తోంది.

అపోలో హాస్పిటల్స్‌ సహకారంతో

అటు ఎయిర్‌టెల్‌ కూడా డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలను అనుసరించి అపోలో హాస్పిటల్స్‌ సహకారంతో ఓ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌తోపాటు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను (https://airtel.apollo247.com/) అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ వయసు, లక్షణాలు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీరు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి మీ రిస్క్‌ స్థాయిని చెబుతోంది. మీ రిస్క్‌స్థాయిని బట్టి సమీపంలోని ఆస్పత్రిని సందర్శించడానికి ఈ టూల్స్‌ ఉపయోగపడతాయి.


ఇవీ చూడండి:'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details