తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో 'ప్రియాంకా'స్త్రం  ఫలించేనా..? - priyanka gandhi campaign

తెలంగాణ కాంగ్రెస్... లోక్ సభ ప్రచారపర్వంపై అప్పుడే దృష్టిసారించింది. శాసనసభ ఎన్నికల్లో జరిగిన ఆలస్యం...పార్టీకి భారీ నష్టమే చేకూర్చింది. ఈసారి ముందుగానే ప్రచార భేరీ మోగించాలని నిర్ణయించింది. రాహుల్​తో పాటు కొత్తగా ప్రియాంక గాంధీ కరిష్మాను ఉపయోగించుకోనుంది.

తెలంగాణలో ప్రియాంక గాంధీ ప్రచారం

By

Published : Feb 13, 2019, 4:38 PM IST

Updated : Feb 13, 2019, 8:30 PM IST

తెలంగాణలో ప్రియాంక గాంధీ ప్రచారం!
సార్వత్రిక ఎన్నికలకు అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది టీపీసీసీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టేందుకు తయారవుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధానంగా ప్రస్తావిస్తూ విస్తృతంగా ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి... ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని భావిస్తోంది.


తెలంగాణలో ఇందిర గాంధీని విపరీతంగా అభిమానించేవాళ్లు ఉన్నారనేది తెలిసిందే. గరీబీ హఠావో, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో ప్రజల మనసుల్లో ఆమె సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మెదక్​ నుంచి పోటీ చేస్తే జనం నీరాజనాలు పట్టారు. ఇప్పుడు ఇందిర పోలికలున్న ప్రియాంకతో ప్రచారం చేయించి ప్రజలను ఆకర్షించాలనేది కాంగ్రెస్ ఎత్తుగడ.


రాహుల్ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడుచోట్ల విజయం సాధించినప్పటికీ తెలంగాణలో ఘోరపరాజయం పాలైంది. బలమైన క్యాడర్, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్నా.... ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి. కేంద్రంలో అధికారం దక్కించుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లో అధిక స్థానాలు గెలుచుకోవాల్సిందే. అందుకోసం ప్రియాంక గాంధీతో ప్రచారం చేయించాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

Last Updated : Feb 13, 2019, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details