ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అవస్థలు పడుతున్న వారి సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితను వేర్వేరుగా కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని... నకిలీ ఏజంట్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రశాంత్ రెడ్డి, కవితను విజ్ఞప్తి చేశారు.
'గల్ఫ్‌లో తెలంగాణ కార్మికుల వెతలు తీర్చండి' - గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకుల తాజా వార్తలు
గల్ఫ్ దేశాల్లో తెలంగాణ కార్మికుల ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితను కలిసి వినతిపత్రం అందజేశారు.

'గల్ఫ్ దేశాల్లో కార్మికుల ఇబ్బందులను పరిష్కరించాలి'
గల్ఫ్ నుంచి వచ్చిన వారికి భవన, నిర్మాణ రంగంలో న్యాక్(NAC)ద్వారా సాంకేతిక శిక్షణ ఇచ్చి... ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి వేముల గల్ఫ్ సంక్షేమ సంఘ నాయకులకు తెలిపారు. దీనిని గ్రామీణ స్థాయిలో విస్తృత పరిచేలా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వారితో అన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి :రైతుల పోరాట పటిమకు వందనం.. బంద్‌లో పాల్గొంటం: కేసీఆర్