తెలంగాణ

telangana

ETV Bharat / state

‘ఆత్మ నిర్భర్‌’ అమలులో మొదటి స్థానంలో తెలంగాణ - తెలంగాణ తాజా వార్తలు

'ఆత్మనిర్భర్' అమల్లో తెలంగాణకు మొదటిస్థానం లభించింది. కొవిడ్ సమయంలో ఉపాధి దెబ్బతినడం వల్ల వీధి వ్యాపారులకు సాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం అమలులో లక్షలోపు జనాభా కలిగిన పురపాలక సంఘాల కేటగిరిలో మొదటి 10 తెలంగాణ రాష్ట్రానికి చెందినవే కావడం గమనార్హం.

‘ఆత్మ నిర్భర్‌’ అమలులో మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణకు
‘ఆత్మ నిర్భర్‌’ అమలులో మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణకు

By

Published : Jan 11, 2021, 10:34 AM IST

వీధి వ్యాపారులకు సంబంధించి ‘ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్‌ పథకం’ అమల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర పురపాలక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ సమయంలో జీవనోపాధి దెబ్బతినడంతో వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా పురపాలక శాఖ వీధి వ్యాపారులు, వీధి వ్యాపారాల జోన్లతో మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీనివల్ల ఆరు రెట్లు ఎక్కువమంది వ్యాపారులకు లబ్ధి చేకూరిందని ఆ శాఖ తెలిపింది.

ఈ పథకం అమలులో లక్షలోపు జనాభా కలిగిన పురపాలక సంఘాల కేటగిరిలో మొదటి 10 తెలంగాణ రాష్ట్రానికి చెందినవే కావడం గమనార్హం. నిర్మల్‌, సిద్దిపేట, కామారెడ్డి, బోధన్‌, సిరిసిల్ల, పాల్వంచ, ఆర్మూర్‌, సంగారెడ్డి, మంచిర్యాల, కోరుట్ల మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. పది లక్షలలోపు జనాభా కలిగిన నగరాల కేటగిరిలో వరంగల్‌ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. 40 లక్షలకు మించిన జనాభా కలిగిన మెగాసిటీల కేటగిరిలో హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ దేశంలో మొదటి స్థానంలో ఉంది.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details