తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Weather Update : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం - Hyderabad Rains Today

Telangana Weather Update : వాతావరణంలో అనిశ్చితి, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఇవాళ తెల్లవారుజాము నుంచి భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

వర్షాలు
వర్షాలు

By

Published : Apr 14, 2023, 11:03 AM IST

Telangana Weather Update : నిన్న మొన్నటి దాకా మండే ఎండలకు నిప్పులా కుంపటిలా మారిన భాగ్యనగరం.. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా మండే ఎండలతో, ఉక్కపోతతో అలమటిస్తున్న నగరవాసులకు చిరుజల్లులతో కాస్త ఉపశమనం లభించింది. గురువారం రోజున రాత్రి కాసేపు కురిసిన వర్షం కాస్త బ్రేక్ ఇచ్చి.. ఇవాళ తెల్లవారుజామున షురూ అయింది.

Telangana Rains today : నగరంలో ఈ రోజు ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, అల్వాల్, తిరుమలగిరి, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, చిలకలగూడ, కాప్రా, కుషాయిగూడ, కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల చింతల్, బాలానగర్, కొంపల్లిలో ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. ఏకధాటిగా దాదాపు రెండు గంటల పాటు కురిసిన వానకు రహదారులన్నీ జలమయమయ్యాయి.

Hyderabad Rains Today : మరోవైపు రాగల మూడు గంటల్లో హైదరాబాద్​తోపాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. నగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్నటిదాకా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కరి అయిన ప్రజలకు ప్రస్తుత వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయని.. కానీ ఈ వర్షాల్లో తడవడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పారు.

Telangana Weather News Today : అయితే ప్రస్తుతం ఈ వర్షాలు హైదరాబాద్, నగర పరిసర ప్రాంతాల్లోనే కురుస్తుండటం కాస్త ఉపశమనం కలిగించే విషయం. ఇటీవలే కురుసిన వర్షాలకు ఇప్పటికే రాష్ట్రంలో రైతులు కుదేలయ్యారు. చేతికొచ్చే సమయంలో పంటంతా నాశనమై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మిగిలిన పంటను కోసి.. ధాన్యం విక్రయించే స్థితిలో ఉండగా.. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కాస్త మిగిలిన పంట కూడా వరణుడు చేతికి దక్కనీయకుండా చేస్తాడేమోనని దిగాలు పడుతున్నారు. మరో వారం పది రోజులు వర్షాలు కురవకుండా ఉంటే పంట చేతికి వచ్చి.. ధాన్యం విక్రయిస్తామని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో పది రోజుల పాటు గ్రామాల్లో వర్షాలు కురవకూడదని ఆ వరుణ దేవుడికి మొక్కుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details