తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంపై అంపన్ ప్రభావం ఉండదు' - ఈ రోజు వాతావరణం

రాష్ట్రంలో నేడు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంపై అంపన్ ప్రభావం ఏమి ఉండదని తెలిపింది.

telangana-weather-report
'రాష్ట్రంపై అంపన్ ప్రభావం ఉండదు'

By

Published : May 19, 2020, 7:15 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్‌ పెను తుపాను ఈ నెల 20న బంగ్లాదేశ్‌లోని హతియా దీవులు, పశ్చిమ బెంగాల్‌లోని దిగా మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. తుపాను ప్రభావం తెలంగాణపై ఏమీ ఉండదని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ 95 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా ఘన్‌పూర్‌ (పీఏపల్లి మండలం)లో 2.7, జున్నుతల (గుర్రంపోడు మండలం)లో 1.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఇవీ చూడండి:కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా..?: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details