Telangana Weather Report: మంగళవారం, బుధవారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దానితో పాటు గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాముందని తెలిపింది. ఈ నెల 29న కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళ మొత్తంతో పాటు కర్ణాటక, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
రెయిన్ అలర్ట్.. రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు! - rains in telangana
Telangana Weather Report: తెలంగాణలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రెయిన్ అలర్ట్.. రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు!
రాగల 2 నుంచి 3 రోజుల్లో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకి, కొంకన్, గోవాలోని కొన్ని భాగాలు తమిళనాడులోని మరికొన్ని భాగాలకు నైరుతి రుతుపవనాలు ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులున్నాయని వివరించింది. ఇప్పుడు రుతుపవనాలు ఉత్తర పరిమితి కార్వార్, చిక్కమగళూరు, బెంగళూరు, ధర్మపురి మీదుగా వెళ్తుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చూడండి: వర్షాలపై ఐఎండీ చల్లని కబురు.. ఈసారి దంచికొట్టుడే!