తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Center) ప్రకటించింది. రెండురోజులు తేలిక పాటి వర్షాలు కురిస్తే ఆ తరువాత రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. శ్రీధర్ చౌహాన్ తెలిపారు. ఆరుతడి పంటలైన పత్తి, సోయా, కంది సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీధర్ చౌహాన్ సూచించారు.
TS WEATHER REPORT: రాష్ట్రంలో రాగల 5 రోజులు భారీ వర్షాలు! - hyderabad news
రాష్ట్రంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో వర్ష సూచన
ఈనెల 11న మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీరాల దగ్గర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లో విస్తారంగా వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఇదీ చదవండి:ramky: రూ.1,200 కోట్లకు పన్ను ఎగ్గొట్టిన రాంకీ సంస్థ