తెలంగాణ

telangana

ETV Bharat / state

బీ అలర్ట్.. రాగల మూడు రోజులు వర్షాలున్నాయ్..! - రాష్ట్రంపై మాండౌస్ ఎఫెక్ట్

Telangana Weather update : రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వర్షం వల్ల వాహనదారులు కాసేపు ఇబ్బందిపడ్డారు.

Weather report
Weather report

By

Published : Dec 11, 2022, 3:37 PM IST

Telangana Weather update : మాండౌస్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. నిన్న ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి.. సాయంత్రం వాయుగుండంగా, ఈ రోజు ఉదయం ఐదున్నర గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారిందన్నారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం కూడా బలహీనపడిందన్నారు.

ఇదిలా ఉండగా.. ఈ మాండౌస్‌ తుపాను ప్రభావంతో భాగ్యనగరంలో ముసురుపట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, బషిర్‌బాగ్‌, నాంపల్లి, కోఠి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనాదారులు, బాటసారులు తడిసిముద్దవుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details