తెలంగాణ

telangana

ETV Bharat / state

WEATHER REPORT: రుతుపవనాల కదలికలు సాధారణం.. ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం.. - తెలంగాణ 2021 వార్తలు

రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నందున రాష్ట్రంలో ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం (weather report) ప్రకటించింది.

telangana-weather-report-for-coming-two-days
రుతుపవనాల కదలికలు సాదారణం.. ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం..

By

Published : Aug 26, 2021, 6:56 AM IST

Updated : Aug 26, 2021, 8:03 AM IST

పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ 11 గంటల వ్యవధిలోనే పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

అత్యధికంగా వర్షాలు.. ఎలాంటి సూచనలివ్వని వాతావరణశాఖ

అత్యధికంగా కోటగిరి(నిజామాబాద్‌ జిల్లా)లో 13.6 సెంటీమీటర్లు, పెద్దూరు(రాజన్న)లో 9, రామారెడ్డి(కామారెడ్డి)లో 8.2, అవునూరు(రాజన్న)లో 7.4, మర్రిపల్లిగూడెం(హనుమకొండ)లో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొన్నిచోట్ల అప్పటికప్పుడు మేఘాలేర్పడి భారీ వర్షం పడుతోంది. వాతావరణశాఖ భారీ వర్షాలు కురుస్తాయని గత రెండు రోజులుగా ఎలాంటి సూచనలు ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు వానలు లేని ప్రాంతాల్లో ఎండ వేడి పెరిగింది. బుధవారం అత్యధికంగా నాగులవంచ(ఖమ్మం జిల్లా)లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

20 రోజులు ఎండ.. వారం రోజుల నుంచి వర్షాలు

గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో పలుచోట్లు ఉన్నట్టుటుండి వర్షాలు కురుస్తున్నాయి. అప్పటి వరకూ చాలా ఎండగా ఉండి... ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. గత నెల రోజులుగా చూసుకుంటే... 20 రోజుల వరకూ ఎండ వేడిమిని తట్టుకోలేక రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయారు. వారం రోజుల నుంచి వర్షం కారణంగా వస్తున్న వరదలతో.. రోడ్డుపై తిరిగేందుకే భయపడిపోతున్నారు. హైదరాబాద్​లో అయితే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాలకు వెళ్లే వారైతే... వర్షం కారణంగా గంటలపాటు ట్రాఫిక్​లో ఉండిపోవాల్సి వస్తోంది.

ఇదీ చూడండి:Rain In City: హైదరాబాద్​లో భారీ వర్షం... తడిసిముద్దైన ప్రజలు

Last Updated : Aug 26, 2021, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details