రాష్ట్రంలో రానున్న రెండురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ts weather report: ఆ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన నైరుతు రుతుపవనాలు తెలంగాణపై చురుగ్గా కదులుతున్నాయని.. వీటి ప్రభావం వల్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నిర్మల్, కుమరంభీం జిల్లాల్లో నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.
నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుగ్గానే కదులుతున్నాయి. అత్యంత భారీ వర్షాలు నిర్మల్, కుమురం భీం జిల్లాల్లో నమోదుకాగా.. అతిభారీ వర్షాలు వరంగల్ రూరల్, జగిత్యాల జిల్లాల్లో నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి. అత్యధిక వర్షపాతం కుమురం భీం జిల్లా వాంకిడిలో 39 సెం.మీ కురిసింది. ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలు చూసుకుంటే 86 శాతం వర్షపాతం.. జూన్ 1 నుంచి జులై 23 వరకు నమోదైంది. ఉష్ణోగ్రత విషయానికొస్తే హైదరాబాద్లో 23.6 డిగ్రీలు.. కనిష్ఠంగా 21.8 డిగ్రీలుగా ఉంది. గత 24 గంటలుగా వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు... ఒకటి రెండు చోట్ల తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాలో తీవ్ర భారీ వర్షాలు.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. - డాక్టర్ నాగరత్న, హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు
ఇదీ చూడండి:telangana floods: మత్తడి దూకుతున్న చెరువులు.. జనావాసాలు జలమయం...