రాష్ట్రంలో రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రానుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల మూడ్రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. సాధారణం కన్నా 2-3 డిగ్రీలు అధికంగా నమోదు కావచ్చని వాతావరణ కేంద్రం వివరించింది.
రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల వర్షాలు - తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
రాష్ట్రంలో రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేగాక ఈ మూడ్రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల వర్షాలు
ఝార్ఖండ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు బలహీనపడిన ద్రోణి ఏర్పడిందని.. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు రానున్నాయని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి :సికింద్రాబాద్ రైల్వే కీలక నిర్ణయం: మాస్క్ లేకపోతే ఫైన్