తెలంగాణ

telangana

ETV Bharat / state

తమిళనాడు తరహా విధానాన్ని ఇక్కడ కూడా అమలుచేయాలి - హైదరాబాద్‌ తాజా వార్తలు

రాష్టంలోని టైప్ రైటింగ్ సంస్థల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెరాస నేత మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. ఇనిస్టిట్యూట్‌లు ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌లో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

telangana typewriting institutes demands for solving their problems
తమిళనాడు తరహా విధానాన్ని ఇక్కడ కూడా అమలుచేయాలి

By

Published : Dec 16, 2020, 9:50 AM IST

విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్న టైప్ రైటింగ్ ఇనిస్టిట్యూట్‌ల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెరాస నేత మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో మంగళవారం జరిగిన తెరాస పార్టీ సర్వ సభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రాష్ట్రంలోని టైపింగ్‌ ఇనిస్టిట్యూట్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు టైపింగ్‌ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపల్స్, ప్రతినిధులు.. రాష్ట్ర సాంకేతిక, విద్యాశాఖ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు తరహా విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. టైప్ రైటింగ్ జూనియర్, లోయర్, హయ్యర్ గ్రేడ్ లతో పాటు నూతనంగా ప్రవేశపెట్టిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల(సీబీటీ)కు సంబంధించిన శిక్షణ, దరఖాస్తులు అన్నీ తమ ద్వారానే కొనసాగేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి:నకిలీ పాన్​కార్డులతో 'సైబర్​గాళ్ల' బ్యాంకు రుణాలు

ABOUT THE AUTHOR

...view details