Revenue of Telangana Transport Department increased :ఆదాయపరంగా రాష్ట్ర రవాణా శాఖ దూసుకెళ్తోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్య మరోవైపు పన్నుల మోతతో దాని ఆదాయం అంచనాలు దాటుతోంది. దీంతో రవాణా శాఖలో రికార్డు స్థాయిలో ఆదాయం వసూలైంది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే.. భారీగా ఆదాయం సమకూరింది. రవాణా శాఖ అధికారులు పక్కా ప్రణాళికాబద్దంగా, సమిష్టిగా పనిచేయడంతోనే రికార్డు స్థాయి ఆదాయం సమకూరినట్లు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో ఆదాయం సమకూరినట్లు తెలుస్తుంది.
Telangana Revenue Budget Analysis :ఏ ఏడాదికి ఆ ఏడాది రవాణా శాఖకు టార్గెట్లు విధిస్తారు. కానీ.. ఈ ఏడాది టార్గెట్‌కు మించి ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాదిలో వాహనాల కొనుగోళ్లు పెరగడంతో పాటు, వివిధ ట్యాక్స్‌ల వసూళ్లు భారీగా వసూలు చేశారు. పన్నులు కట్టకుండా తిరుగుతున్న వానదారులపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం ప్రత్యేక దృష్టి సారించింది. కొన్నేళ్లుగా వాహనాల పన్నులు కట్టకుండా తిరుగుతున్న వారి నుంచి సైతం ఈసారి పన్నులు వసూలు చేశారు. గతేడాది మే నెలలో వాహనాల జీవితకాల పన్నును ప్రభుత్వం పెంచటంతో ఆదాయమూ భారీగా వృద్ధి చెందుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోలేని రవాణాశాఖ.. ప్రస్తుత ఏడాదిలో మాత్రం ఆదాయార్జనలో పరుగులు పెడుతోంది.