ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో స్థానం పొందగలిగే 20 వరకు చారిత్రక ప్రదేశాలు తెలంగాణలో ఉన్నాయని.. వరల్డ్ టూరిజం మ్యాప్‌లో వాటన్నింటికీ చోటు దక్కేలా కృషి చేస్తామని పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister srinivas goud) ప్రకటించారు. తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను (tourism day) ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో చారిత్రక ప్రదేశాల విశిష్టతను తెలియజేసేలా ప్రత్యేకంగా రూపొందించిన సీడీని మంత్రి శ్రీనివాస్ గౌడ్, పర్యాటక శాఖాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న పలు సంస్థలకు ఎక్సలెన్స్ అవార్డులు (Excellence Awards) అందజేశారు. ఇందులో భాగంగా రామోజీ సంస్థలకు చెందిన సంస్థలు రెండు అవార్డుతో మెరిశాయి.
పర్యాటకులను ఆకర్షించే సంస్థలకు ప్రత్యక రాయితీలు
తెలంగాణ రాష్ట్రంలో అద్భుత చారిత్రక ప్రదేశాలున్నాయని.. గత పాలకుల స్వార్థం వల్ల ఇవన్నీ వెలుగులోకి రాలేక.. చాలా పర్యాటకాన్ని రాష్ట్రం కోల్పోయిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు వచ్చే విదేశీ పర్యాటకులు సైతం పెరిగారని మంత్రి తెలిపారు. వరంగల్ రామప్ప దేవాలయం మాదిరి రాష్ట్రంలోని ఇతర చారిత్రక ప్రాంతాలకు ఆ గుర్తింపు దక్కేలా పాటుపడతామని మంత్రి వెల్లడించారు. పర్యాటకులను ఆకర్షించే సంస్థలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామన్న మంత్రి.. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి టూరిజం కొరకు ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు.
రెండు అవార్డులతో మెరిసిన రామోజీ గ్రూపు సంస్థలు