Telangana Tourism Bhavan Fire Accident in Hyderabad : హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో మంటలు చేలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి అక్కడి భద్రతా సిబ్బంది సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లోని ఫైల్స్, ఫర్నీచర్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అదే విధంగా మంటలు చెలరేగినప్పుడు కార్యాలయం కింద ఉన్న రెండు ఇన్నోవా కార్లపై అగ్ని కీలలు పడటంతో అవి కూడా పూర్తిగా కాలిపోయాయి. ఎన్నికల కోడ్ ఉల్లఘించిన పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌రావును ఇటీవలే ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. దీంతో ఈ ఘటన ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Fire Accident in Hyderabad Today :ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగపోయినా భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. నారాయణగూడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కావాలనే ఎవరైనా నిప్పు పెట్టారా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పలు పార్టీల నేతలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నాంపల్లి బజార్‌ఘాట్‌లో అగ్నిప్రమాద ఘటన - ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే యజమానిపై చర్యలు