Telangana bags first place in environmental performance :ఒక చెట్టు పెరిగిన తర్వాత ఏడాదికి రూ. కోట్లు విలువ చేసే ఆక్సిజన్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా ఉత్పత్తి చేస్తుంది. కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ప్రాణవాయువు కొనుగోలు చేయడం ఆర్థికంగా ముడిపడి ఉన్న అంశమని తేటతెల్లమైంది. చెట్లు నాటడం ఎంత ముఖ్యమో తెలిసేలా చేసింది. అయితే అభివృద్ధి పేరుతో మానవాళి చర్యల కారణంగా ప్రతి ఏడాది అటవీ ప్రాంతం తగ్గుతూ వస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన తెలంగాణ సర్కార్ హరితహారం, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి కార్యక్రమాలతో అడవుల పెంపకంపై.. పచ్చదనం పెరుగుదలపై దృష్టి సారింది. ఈ క్రమంలోనే పర్యావరణ హితం కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.
World Environment Day Today :ఎన్నో రంగాల్లో తన సత్తా చాటుతున్నతెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. అడవుల పెరుగుదల, మురుగునీటి శద్ధి, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ తదితల పర్యావరణహిత కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేవథ్యంలో శాస్త్ర పర్యావరణ కేంద్రం (సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్- సీఎస్‌ఈ) స్టేట్ ఆఫ్ స్టేట్ ఎన్విరాన్‌మెంట్ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది.
Telangana Top In Environmental Performance : దేశంలో మొత్తం 29 రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వగా.. 7,213 పాయింట్లతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే 2.757 పాయింట్లతో రాజస్థాన్ చివరి స్థానంలో ఉంది. మిగిలిన 27 రాష్ట్రాలు 3 నుంచి 7 వరకూ పాయింట్లను సాధించుకున్నాయి. తెలంగాణ తర్వాత వరుస అయిదు స్థానాల్లో గుజరాత్, గోవా, మహారాష్ట్ర, హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. పచ్చదనం వృద్ధిలో ముందుండే ఈశాన్య రాష్ట్రాలు మాత్రం ఈసారి చివరి 10 స్థానాల్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో రెండు, మూడేళ్లుగా జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టుల నిర్మాణపనుల వల్ల పచ్చదనం వృద్ధిపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.