ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలురష్యాపై ఈయూ కఠిన ఆంక్షలు Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై కఠిన ఆంక్షలకు సిద్ధమైంది ఐరోపా సమాఖ్య. యురోపియన్ దేశాల నేతల ఆమోదం తెలపగానే అమలులోకి తీసుకురానున్నట్లు యురోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డైర్ లియాన్ తెలిపారు. రష్యా చర్యను బ్రిటన్ తప్పుపట్టింది. నట్టేట మునిగిన ఉక్రెయిన్Ukraine Crisis: ప్రపంచ దేశాల మాటలు నమ్మి.. అణ్వాయుధాలు వదులుకొని.. జాతీయ భద్రతను వారి చేతిలో పెట్టినందుకు ఫలితం అనుభవిస్తోంది ఉక్రెయిన్. దేశ రక్షణ కోసం నిస్సహాయంగా ఆర్తనాదాలు చేస్తోంది. నాడు అండగా నిలుస్తామని చెప్పిన ఏ ఒక్క దేశం సాయానికి రావడం లేదు.పిల్లలు ఎలా ఉన్నారో..? students trapped in Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుతున్న కరీంనగర్, నిజామాబాద్‌కు చెందిన విద్యార్థుల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని.. తమవారిని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు నిన్న వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 30మంది తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు.అదే కేసీఆర్ నైజం MLC Kavitha Comments: ఏం చేస్తామో.. అదే చెప్పడం కేసీఆర్ నైజమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ పార్టీ బాగు పడలేదన్నారు. కామారెడ్డిలో తెరాస జిల్లా అధ్యక్షుడు ముజిబుద్ధీన్ ప్రమాణ స్వీకార సభలో ఆమె పాల్గొన్నారు.అధిష్ఠానంతో మాట్లాడతాం Jagga Reddy meet CLP: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ఇటీవలే జగ్గారెడ్డి ప్రకటించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.40 అడుగుల టవర్ ఎక్కి..A Child Climbed on High Tower: 8 ఏళ్ల బాలుడు 40 అడుగుల టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. హాస్టల్‌కు వెళ్లనని మారాం చేశాడు. ఒకవేళ పంపిస్తే.. అక్కడి నుంచి దూకుతానని బెదిరించడం గమనార్హం. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.మహిళలను రేప్ చేస్తానంటూ Threat Call to Israel Consulate: దేశంలోని బాలికలు, మహిళలపై అత్యాచారానికి పాల్పడతామని ముంబయిలోని ఇజ్రాయెల్ కాన్సులేట్‌కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దుండగుడు వారిని హత్య చేస్తానని కూడా హెచ్చరించినట్లు సమాచారం. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.సిక్కు విద్యార్థినికీ 'హిజాబ్' సెగHijab row: కర్ణాటకలో తీవ్రదుమారం రేపిన హిజాబ్ వివాదం.. సిక్కు విద్యార్థినిని చుట్టుముట్టింది. తను చుట్టుకున్న తలపాగా తీసివేయాలని కళాశాల యాజమాన్యం ఆదేశించింది. కర్ణాటక హైకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని పేర్కొంది.కోహ్లీ, షోయబ్ రికార్డుకు చేరువలో IND VS SL first T20 Rohith record: భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రెండు రికార్డులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి శ్రీలంకతో మెుదలయ్యే టీ20 సిరీస్‌లో 37 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కునున్నాడు.ఉక్రెయిన్‌లో షూటింగ్ చేసిన భారతీయ సినిమాలు ఇవే!ప్రస్తుతం ఉక్రెయిన్‌లో బాంబులతో మోత మోగిపోతుంది. అయితే ఈ దేశంలో దక్షిణాది సినిమాలు గతంలో షూటింగ్ చేశాయి. వీటిలో 'ఆర్ఆర్ఆర్', '2.ఓ' చిత్రాలు ఉన్నాయి.