తెలంగాణ

telangana

ETV Bharat / state

TOP TEN NEWS: టాప్​టెన్​ న్యూస్​ @7PM - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS
TOP TEN NEWS

By

Published : Feb 23, 2022, 6:58 PM IST

  • తెలంగాణ జలసాగర్‌

CM KCR inaugurate Mallannasagar project : కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ ఎత్తిపోతలను ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజినీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్న.. మల్లన్నసాగర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు. దేశమంతా కరవు వచ్చినా.. తెలంగాణకు రాదని స్పష్టం చేశారు.

  • ట్రాఫిక్​ పోలీసుల గుడ్​న్యూస్​!

Hyderabad Traffic Challan : చలాన్లు ఉన్న వాహనదారులకు పోలీసులు గుడ్​న్యూస్​ చెప్పబోతున్నారు. పెండింగ్​ చలాన్లకు రాయితీ ఇచ్చేందుకు దస్త్రాన్ని సిద్ధం చేశారు. డీజీపీ ఆమోదముద్ర వేస్తే రాయితీతో పెండింగ్​ చలాన్లు కట్టొచ్చు.

  • మత ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తే

Karmanghat incident: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఇన్​ఛార్జ్​ డీజీపీ అంజనీకుమార్​ హెచ్చరించారు. కర్మన్​ఘాట్​ ఘటనపై సీపీలు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనలో 5 కేసులు నమోదు చేశామని చెప్పారు.

  • తెలంగాణపై వివక్ష

TRS Bayyaram Protest: విభజన హామీలు నెరవేర్చని భాజపా ఎంపీలు వారి పదవులకు రాజీనామా చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో తెరాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఉక్కు నిరసన దీక్ష ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరై గులాబీ నాయకులతో దీక్ష విరమింపజేశారు.

  • కొత్త జిల్లాలపై రగడ

"మా ప్రాంతాన్ని జిల్లాగా చేసేవరకు చెప్పులు, బూట్లు వేసుకోను. అసెంబ్లీలో ఒక్క ప్రశ్న కూడా అడగను.".. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే శపథం ఇది. ఇంతకీ ఎవరాయన?

  • ఎక్స్​ప్రెస్​ రైలులో మంటలు

Fire accident in train: సికింద్రాబాద్​- దానాపుర్​ ఎక్స్​ప్రెస్​ రైలులోని జనరల్​ బోగీల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని బేతుల్​ వద్ద జరిగింది.

  • ప్రజా సమస్యలు గాలికి

Congress in up elections: ఉత్తర్​ప్రదేశ్​లో ప్రజా సమస్యలపై ఎస్​పీ, భాజపా చర్చించడం లేదని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేలా.. తీవ్రవాదం గురించి మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.

  • ఉక్రెయిన్​లో ఎమర్జెన్సీ

Ukraine crisis: సరిహద్దుల్లో రష్యా దూకుడుగా ప్రవర్తిస్తున్న క్రమంలో అప్రమత్తమైంది ఉక్రెయిన్​. ఎలాంటి పరిస్థితులకు భయపడేది లేదని చెప్పిన ఆ దేశం అందుకు తగినట్లుగా సిద్ధమవుతోంది. తాజాగా దేశంలో అత్యవసర పరిస్థితి విధించేందుకు.. ఆ దేశ భద్రతా మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు.. రష్యాపై మరిన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

  • సమంతను చూసి షాక్

Samantha shaakuntalam: 'శాకుంతలం' సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పారు డైరెక్టర్ గుణశేఖర్. సమంత, తన నటనతో ప్రేక్షకులకు షాకిస్తుందని అన్నారు.

  • రూ.14 కోట్ల ప్లేయర్ ఈ సీజన్​కు దూరం!

Deepak Chahar IPL 2022: ఐపీఎల్​కు ముందు చెన్నై సూపర్​ కింగ్స్​కు షాక్​ తగిలింది! భారీ ధరకు కొనుగోలు చేసిన ఫాస్ట్​బౌలర్​ దీపక్​ చాహ​ర్​ గాయం కారణంగా ఈ సీజన్​కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్డిండీస్​తో జరిగిన సిరీస్​ల చాహర్​ గాయపడటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details