తెలంగాణ

telangana

ETV Bharat / state

TOP TEN NEWS: టాప్‌టెన్ న్యూస్@9PM - TOP TEN NEWS IN TELANGANA

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS
TOP TEN NEWS

By

Published : Feb 22, 2022, 8:59 PM IST

  • ఎన్జీటీ ఆగ్రహం

NGT On New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణంపై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయనందుకు కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లైనా కౌంటర్ దాఖలు చేయనందుకు రూ.10 వేలు జరిమానా విధించింది. వచ్చే నెల 15లోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఎన్జీటీ ఆదేశించింది.

  • రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో పదాధికారుల భేటీలో బండి సంజయ్ పాల్గొన్నారు.

  • 'ఫ్యాక్టరీ తెస్తే దండేసి దండంపెడతాం'

TRS on Bayyaram Steel Plant : విభజన హామీల అమలు విషయంలో భాజపా, అధికార తెరాస మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బయ్యారం ఉక్కుకర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై తెరాస లోక్​సభపక్ష నేత నామ నాగేశ్వరరావు మండిపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా విభజనచట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కుకర్మాగారం హామీ నుంచి కేంద్రం తప్పించుకుంటోందని మండిపడ్డారు.

  • పార్వతి పాట పాడింది.. 'పల్లె వెలుగు' వచ్చింది

Bus facility to Parvati's village: పల్లె కోయిల పాటకు పల్లె వెలుగు బస్సు కదిలొచ్చింది. కొన్నేళ్లుగా ఆ కుగ్రామం ఎదుర్కొంటున్న రవాణా కష్టాలకు తెరదించింది. ఊరంతా వెన్నెల అనే గీతంతో ఊరంతా ఆనందం నింపిన ఆమె పాట ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం.

  • గుండె ఆగినా...

CPR Technique: శరీరానికి రక్తాన్ని ప్రసరణ చేస్తూ... మనిషి ప్రాణాలను కాపాడుకోవటంలో గుండెది కీలకపాత్ర. ఇటీవల కార్డియాక్ అరెస్టు కేసుల సంఖ్య పెరుగుతోంది. క్షణాల్లోనే గుండె పనిచేయటం ఆగిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె కొట్టుకోవటం ఆగిపోయిన వారికి వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు.

  • శవంపైనే అత్యాచారం

Sex With Dead Body: రేప్​ ప్రయత్నం విఫలం కాగా చంపి.. బాధితురాలి మృతదేహంపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ ఘటన దిల్లీ బురారీలో జరిగింది. మరో ఘటనలో టాయిలెట్​ కోసం స్కూల్​ వెనుకకు వెళ్లిన పదేళ్ల బాలికను రేప్​ చేశాడు 50 ఏళ్ల వ్యక్తి. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

  • మోదీతో టీవీ డిబేట్​కు రెడీ

Imran khan Tv Debate With Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ డిబేట్​లో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆ చర్చ ద్వారా ఇరు దేశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమైతే ఉపఖండంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.

  • స్వామీజీపై రేపిస్ట్ ముద్ర.. మర్మాంగం కట్..

False rape case: స్వామీజీ అంగాన్ని కోసేసి, అత్యాచార యత్నం కేసు పెట్టిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఫిర్యాదు చేసిన మహిళ అబద్ధపు కేసు పెట్టినట్లు కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కనుగొన్నారు. ఇప్పుడు ఆ మహిళపైనే కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నారు.

త్రివిక్రమ్​పై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు..

Bandla Ganesh Trivikram: పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'భీమ్లానాయక్​' రిలీజ్​కు​ సిద్ధంగా ఉన్న సమయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​ పేరుతో ఓ ఆడియో విపరీతంగా వైరల్​ అవుతోంది. దర్శకుడు త్రివిక్రమ్​పై బండ్ల తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అందులో ఉంది.

బాలుడికి అండగా భారత స్టార్ క్రికెటర్

KL Rahul Donation: భారత క్రికెటర్​ కేఎల్​ రాహుల్​.. ఓ బాలుడికి అండగా నిలిచాడు. అరుదైన రక్త రుగ్మతతో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడి ఆపరేషన్​కు రూ.31 లక్షలు సమకూర్చి తన ఔదార్యం చాటుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details