తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@9PM - TELANGANA NEWS

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్@9PM
టాప్​టెన్ న్యూస్@9PM

By

Published : Jan 1, 2021, 8:59 PM IST

1. కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌కు ఏర్పాట్లు

రాష్ట్రంలో రేపు నిర్వహించనున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్​లో 4, మహబూబ్‌నగర్‌లో 3 ఆస్పత్రుల చొప్పున డ్రై రన్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా

సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా సోకింది. ఇటీవల ఓ అంత్యక్రియలకు హాజరైన సదరు కుటుంబంలోని ఓ వ్యక్తికి కరోనా నిర్ధరణ అయింది. అనుమానం వచ్చి మిగతా కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా... అందరికీ పాజిటివ్​గా తేలినట్టు డీహెంచ్​ఓ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. తెగ తాగేశారు

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. కొవిడ్‌ మూలంగా నెలన్నర రోజులు మద్యం దుకాణాలు మూసివేసినా... 2020లో రూ. 25వేల కోట్లకుపైగా విలువైన మద్యాన్ని రాష్ట్ర ప్రజలు తాగేశారు. ఏడాది కాలంలో 3.25 కోట్ల కేసుల లిక్కర్‌, 2.93 కోట్ల కేసుల బీరు అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. రైతులను వేధించడం సరికాదు

నలభై ఏళ్లుగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న భూమికి.. ఈ- పాస్​బుక్​లు జారీ చేయడానికి అభ్యంతరాలేమిటని రెవెన్యూ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. కొత్త విధానాల పేరుతో రెవెన్యూ అధికారులు రైతులను వేధిస్తున్నారని... ఓ స్థలానికి సంబంధించిన కేసు విచారణలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. రోజూ 10లక్షల మందికి టీకా

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ వైద్య కళాశాలల క్రికెట్ పోటీలను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. కరోనా యోధులు క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. తెలంగాణలో సెకండ్ వేవ్ లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. పురోగతి లేకుంటే 6న ట్రాక్టర్​ ర్యాలీ

వ్యవసాయ చట్టాలపై జనవరి 4న మరో విడత జరగనున్న చర్చల్లో పురోగతి లేకుంటే.. ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు రైతులు. అన్నివైపుల నుంచి దిల్లీని ముట్టడిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. రాజస్థాన్​లో కొత్త వైరస్

రాజస్థాన్​లో ఏవియన్ ఇన్​ఫ్లుయెంజా బారిన పడి వంద కాకులు మరణించాయి. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు.. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు పాటించాలని జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు హై అలర్ట్ జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ప్రియురాలి ఇంటికి సొరంగం

రైలు మార్గం కోసం టన్నెల్​ వేయడం విన్నాం. కానీ, మెక్సికోలోని ఓ పైళ్లైన వ్యక్తి... తన ప్రియురాలిని దొంగచాటుగా కలిసేందుకు సొరంగం తవ్వాడు. తన ఇంటి నుంచి ఆమె ఇంటి వరకు భారీ సొరంగాన్ని తవ్వి అడ్డంగా దొరికిపోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. న్యూఇయర్​ అప్​డేట్స్​!

టాలీవుడ్​ కొత్త సినిమాల అప్​డేట్స్​ వచ్చేశాయి. నూతన సంవత్సరం సందర్భంగా ప్రేక్షకులను శుభాకాంక్షలు తెలుపుతూ.. పలు సినిమాల ఫస్ట్​లుక్​లను చిత్రబృందాలు విడుదల చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. మరో రెండు ప్రపంచకప్​లలో ఆడతా

'వయసు పెరిగేకొద్దీ ఎవరికైనా అలుపొస్తుంది. కానీ నాకు మాత్రం ఊపు వస్తుంది' అని అంటున్నాడు వెస్టిండీస్​ విధ్వంసకర బ్యాట్స్​మన్​ క్రిస్​గేల్​. నాలుగు పదుల వయసు దాటినా.. తనలో ఏమాత్రం సత్తువ తగ్గలేదని చెబుతున్నాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details