ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుడిజిటల్ భారత్‌కు 'బడ్జెట్' రైట్ రైట్ Union Budget 2022: దేశాన్ని 'డిజిటల్ ఇండియా'గా తీర్చిదిద్దేందుకు ఈసారి బడ్జెట్‌లో సాంకేతికతపై ప్రత్యేక దృష్టిసారించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా డిజిటల్ కరెన్సీని తీసుకురానుంది. బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మరోసారి మొండి చెయ్యే ఎదురైంది. హామీలు సహా ఇతరాలకు వేటికీ తెలంగాణ నోచుకోలేదు. పన్నుల్లో వాటాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 17వేల కోట్లకు పైగా నిధులు రానున్నాయి. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు కేంద్రం రుణంగా ప్రతిపాదించిన లక్ష కోట్లలో తెలంగాణకు 3 వేల కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.నేటి నుంచి సహస్రాబ్ది వేడుకలు సమతకు చిహ్నమైన దివ్యమూర్తి శ్రీరామానుజాచార్య.. సహస్రాబ్ది సమరోహానికి శంషాబాద్‌లోని ముచ్చింతల్ దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి 12 రోజులపాటు జరిగే ఉత్సవాలకు జీయర్ ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. చిన్నజీయర్ స్వామి స్వయం పర్యవేక్షణలో జరగనున్న సమతామూర్తి విగ్రహావిష్కరణ.. సాయంత్రం 5 గంటలకు అంకురార్పరణ జరగనుంది. 'అర్థం కావాలంటే.. బుర్ర ఉండాలిగా!' సామాన్యులకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్‌లో ఏమీ లేదన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్రంగా స్పందించింది. అసలు బడ్జెట్‌ను అర్థం చేసుకోగల సామర్థ్యం విపక్ష నేతలకు లేదని ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి గురించి ముందు మాట్లాడాలని సవాలు విసిరింది.రైతుల ఆదాయం పెరిగిందెక్కడ? 2022 నాటికి అన్నదాతల ఆదారం రెట్టింపుచేస్తామని కేంద్రం నాడు ప్రకటన చేసినా.. కేంద్ర బడ్జెట్‌లో ఆ ప్రస్తావన ఎక్కడా వినబడలేదు. రైతు ఆదాయం రెట్టింపు (డీఎఫ్‌ఐ) ఎలా చేయాలనే అంశంపై కేంద్రం 2015లో జాతీయస్థాయిలో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఒక్కో రాష్ట్రంలో రైతుల ఆదాయమెంత, 2022-23 నాటికి ఎంతకు పెరగాలో గణాంకాలతో వివరించింది. అనంతరం ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ జరగలేదు.ఆర్థిక వ్యవస్థలో మనమే టాప్.. కానీ.. భారత్‌కు ఆధునికత నేర్పాం... ముందుకు నడిపించాం అని చెప్పే ఆంగ్లేయులు అత్యంత దారుణంగా మనల్ని తిరోగమనంలోకి నెట్టారు. వందల ఏళ్ల పాటు సుసంపన్న ఆర్థిక శక్తిగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారతావనిని అట్టడుగుకు తీసుకొచ్చారు.ప్రపంచంలోనే అతిపెద్ద మెరుపు ప్రపంచంలోనే అతి పెద్ద మెరుపును అమెరికాలో గుర్తించినట్లు ఐరాసకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా వెల్లడించింది. 2020 ఏప్రిల్‌లో అమెరికా దక్షిణ ప్రాంతంలో దాదాపు 770 కిలోమీటర్ల మేర వ్యాపించిన ఈ మెరుపు సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు పేర్కొంది.ఫ్యూచర్ రిటైల్‌కు ఊరట అమెజాన్ కేసులో ఫ్యూచర్ రిటైల్‌కు ఊరట లభించింది. రిలయన్స్ రిటైల్‌తో చేసుకున్న రూ.24,731 కోట్ల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ 'అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం' ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి తిరస్కరించడం సహా దిల్లీ హైకోర్టు ఇచ్చిన మూడు ఆర్డర్లను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. తాజా విచారణకు ఆదేశాలు జారీ చేసింది.కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్.. ఎప్పుడంటే? 24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. అయితే ఈసారి మహిళల జట్లు మాత్రమే పోటీపడనున్నాయి. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఈ గేమ్స్ జరగనున్నాయి.కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ', విశాల్ 'సామాన్యుడు' సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి