తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @ 7PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top news
టాప్​టెన్​ న్యూస్​

By

Published : Apr 20, 2021, 7:00 PM IST

1. కొవిడ్​ ఇన్​పేషెంట్లకు డయాలసిస్​ సేవలు

గాంధీ, టిమ్స్​ ఆస్పత్రుల్లోని కొవిడ్​ ఇన్​పేషెంట్లకు డయాలసిస్​ సేవలు అందించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. గాంధీ ఆస్పత్రిలో ఒక్కో డయాలసిస్​కు రూ.1,175, టిమ్స్​ రూ.1,215 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. థియేటర్లు బంద్​

కరోనా విజృంభణ మరోసారి సినీ పరిశ్రమను ఇరకాటంలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో నేడు సమావేశమైన ప్రదర్శనదారులు, పంపిణీదారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు. 'వకీల్​సాబ్' ప్రదర్శితమవుతోన్న థియేటర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మరింత వేగంగా..

రాష్ట్రానికి మరో మణిహారంగా నిర్మితం కాబోతున్న రీజినల్ రింగ్ రోడ్​కు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తర భాగానికి సంబంధించి డీపీఆర్ కన్సల్టెన్సీల నియామానికి ఎన్​హెచ్ఏఐ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో మే 2 నుంచి జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొత్త తేదీని పరీక్షకు కనీసం 15 రోజుల ముందు ప్రకటిస్తామని పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కోర్టులో కొవిడ్​ కలకలం

దిల్లీలోని కడ్​కడ్​డూమా జిల్లా కోర్టులో కరోనా కలకలం రేపింది. ఏడుగురు జడ్జిలు, 37 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో వారందరిని ఐసోలేషన్​కు తరలించారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. వెనక్కి తగ్గితేనే..

వాస్తవాధీన రేఖ వద్ద శాంతిని కొనసాగించడానికి కుదిరిన ఏకాభిప్రాయాన్ని పాటించకుండా ఉండరాదని చైనాకు భారత్‌ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరగాలంటే తూర్పు లద్దాఖ్‌లో చైనా తమ బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. యుద్ధక్షేత్రంలోనే ఆ దేశ అధ్యక్షుడు మృతి

ఆఫ్రికాలోని 'చాద్' దేశ అధ్యక్షుడు ఇడ్రిస్ డెబీ ఇట్నో మరణించారు. దేశానికి మూడు దశాబ్దాలకు పైగా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన.. దేశంలో తిరుగుబాటు దారులతో జరిగిన ఘర్షణలో మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. యుద్ధరంగంలోనే ఇడ్రిస్ మరణించారని ఆ దేశ సైన్యం అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయా..!

ప్రపంచం అరచేతిలోకి వచ్చాక సంపాదనకు బోలెడన్ని దారులు తెరుచుకున్నాయి. ఇంట్లోనే కూర్చొని గంటకు రూ. వేల నుంచి లక్షల్లో వేతనం తీసుకునే రోజులు వచ్చాయి. కొత్త కొత్త ప్రొఫెషన్స్​ పుట్టుకొస్తున్నాయి. ఊహించనంత ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. వింత కొలువుల గురించి మీరు కూడా తెలుసుకోండి.

9.'మన్కడింగ్​ను తప్పనిసరి చేయాలి'

క్రికెట్​లో మన్కడింగ్​ను తప్పనిసరి చేయాలంటూ అభిప్రాయపడ్డాడు వ్యాఖ్యాత హర్షా భోగ్లే. బ్యాట్స్​మెన్​కు లేని నిబంధనలు బౌలర్లకు ఎందుకని ప్రశ్నించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. విజయ్​-రష్మిక జోడీ మరోసారి!

అభిమానులను అలరించేందుకు మరోసారి జతకట్టనున్నారు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ, రష్మిక. ఇప్పటికే 'గీత గోవిందం', 'డియర్​ కామ్రేడ్'​ చిత్రాల ద్వారా ప్రేక్షకులను పలకరించిన వీరిద్దరూ ఈసారి ఓ యాడ్​లో కలిసి కనువిందు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details