గుర్తులు పెట్టకూడదు
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు రేపు జరిగే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ సూచించారు. ఈసారి పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున.. ఓటర్లు జాగ్రత్తగా ఈసీ ఇచ్చిన స్కెచ్‌పెన్‌తో మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కేటీఆర్ సర్ప్రైజ్
మంత్రి కేటీఆర్ మరోసారి ఉదారత చాటుకున్నారు. తెరాస కార్యకర్త కుమార్తె పుట్టినరోజున ఓ పాపకు శుభాకాంక్షలు తెలిపి సర్ప్రైజ్ చేశాడు. తనకు ఏం గిఫ్ట్ కావాలని కేటీఆర్ అడగగా.. ఎన్నికల్లో తెరాస గెలవాలని కోరుకుంటున్నట్లుగా చిన్నారి చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
టీఎస్పీఎస్సీ పేరిట నకిలీ మెయిల్
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలున్నాయంటూ టీఎస్పీఎస్సీ పేరిట వచ్చిన మెయిల్ కలకలం సృష్టించింది. అప్రమత్తమైన అధికారులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈసీకి ఫిర్యాదు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రేపే ఓట్ల లెక్కింపు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నెల 10న.. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.