1. శతాబ్దిలో చెలరేగిన మంటలు
దిల్లీ నుంచి దేహ్రదూన్ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హరిద్వార్‌లోని రాజాజీ పులుల సంరక్షణ కేంద్రం ఆవరణలోని కాంసారో స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
2. థాంక్యూ సంతన్న
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ... తన పుట్టినరోజున మొక్కలు నాటారు. అమ్మతో కలిసి మొక్కలు నాటటం ఆనందంగా ఉందన్న కవిత... మంచి బహుమతి ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. దిశా నిర్దేశం
సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఖర్చులకు పైసలిస్తాం
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆచితూచి మాట్లాడాల్సిన నేతలు... నోరు జారుతున్నారు. గుట్టుగా చేసే పనులను బహిరంగంగా ప్రస్తావిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు. తాజాగా... "ఓటేస్తే ఖర్చులకు పైసలిస్తాం" అని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. స్తంభమెక్కి హల్చల్
రోజూ పని చేస్తున్నా.. కూలీ డబ్బులు రావడం లేదు. పైసలు లేక తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. వీటన్నింటితో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. మద్యం సేవించి విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేశారు. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.