తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Feb 10, 2021, 5:00 PM IST

టాప్​టెన్ న్యూస్@5PM
టాప్​టెన్ న్యూస్@5PM

1. వరాల జల్లు

త్వరలో కొత్త పింఛన్ల ప్రక్రియ చేపడతామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. నల్గొండ జిల్లా హాలియ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం నల్గొండ జిల్లాపై వరాలు కురిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. హాలియాలో తెరాస సభ

నల్గొండ జిల్లా హాలియాలో తెరాస భారీ బహిరంగ సభ నిర్వహించింది. బహిరంగ సభకు తెరాస శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. ఎలా జరిగింది?

వరంగల్‌ గ్రామీణ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి తొర్రూర్ వెళ్తున్న కారు పర్వతగిరి మండలం కొంకపాక వద్ద ఎస్సారెస్పీ కాల్వలో పడిపోయింది. కారులో నలుగురు ఉండగా ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. టీం ఇండియాలో తెలుగమ్మాయి

భారత ఫుట్​బాల్​ మహిళా సీనియర్ జట్టుకు మొదటిసారి ఓ తెలుగమ్మాయి ఎంపికైంది. ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతి భారత జట్టుకు ప్రాతినధ్యం వహించే సువర్ణావకాశాన్ని చేజిక్కించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ప్రలోభాలు

రాష్ట్రంలో సంచలన సృష్టించిన దిశ నిందితుల ఎన్​కౌంటర్​​ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వారి కుటుంబసభ్యులను కేసు వెనక్కి తీసుకోవాలంటూ బాధితులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని వారి తరఫు న్యాయవాది రజనీ ఆరోపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. సరిహద్దుల్లో ఉద్రిక్తత

అసోం-మిజోరం సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో పలు చోట్ల ఆస్తి నష్టం సంభవించగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. నడ్డా, దీదీ మాటల యుద్ధం

బంగాల్​లో అధికార టీఎంసీ, భాజపా మధ్య మాటల యుద్ధం ఉద్ధృతంగా సాగుతోంది. సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా.. భాజపా అధినేత నడ్డా విమర్శల పర్వం కొనసాగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. కరోనాపై బామ్మ విజయం

వందేళ్లు జీవిస్తేనే గొప్పగా భావించే నేటి రోజుల్లో.. 116 ఏళ్లలోనూ కరోనాను ఓడించారు ఓ ఫ్రెంచ్​ బామ్మ. గత నెలలో కరోనా బారినపడ్డ సిస్టర్​ ఆండ్రే.. మూడు వారాలపాటు వైరస్​తో పోరాడి, ఇటీవలే కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. రాముడి పాత్రలో ప్రిన్స్?

ప్రిన్స్ మహేశ్​ బాబు రాముడిగా కనిపించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు. బాలీవుడ్​లో తెరకెక్కబోతున్న 'రాయాయణ్' చిత్రంలో మహేశ్​ హీరోగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. దాహం తీరనిది

భారత పిచ్​లంటేనే స్పిన్​కు సహకరిస్తాయని తెలుసు. వీటిపై బ్యాటింగ్​ చేయాలంటే హేమాహేమీలే భయపడేవారు. అలాంటిది ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​ మాత్రం మంచినీళ్లు తాగినంత సులభంగా పరుగులు చేసేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details