1. పదేళ్లు నేనే
ముఖ్యమంత్రి మార్పుపై కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. తానే సీఎంగా ఉంటానని కుండబద్దలకొట్టారు. ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించిన ఆయన.. త్వరలో జరగనునున్న నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కాంగ్రెస్ శంఖారావం
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని లూఠీ చేస్తున్నారని పదేపదే మాట్లాడుతున్న భాజపా నేతలు... ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2018లో కాంగ్రెస్‌కు తిరుగులేదని నిరూపించిన ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తామని నేతలు ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పర్యటనలో ఉద్రిక్తత
సూర్యాపేట జిల్లా మంఠంపల్లి మండలం గుర్రంపోడులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. గిరిజన భూములు ఆక్రమించారంటూ భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో రాజీవ్ రైతు భారోసా దీక్షకు హాజరైన రేవంత్... హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలుదేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. గంటలో కోటి మొక్కలు
ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.