తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​@1PM - Telangana news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్​@1PM
టాప్​టెన్ న్యూస్​@1PM

By

Published : Jan 4, 2021, 1:00 PM IST

1. దేశం గర్విస్తోంది

రెండు కరోనా టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన భారత శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. అతిపెద్ద టీకా వ్యాక్సినేషన్ భారత్​లో ప్రారంభం కానుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. సంక్రాంతి స్పెషల్

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానముంది. దేశవిదేశాల్లో స్థిరపడిన వాళ్లంతా సొంతూళ్లకు బయలుదేరి వెళుతుంటారు. పిండి వంటలు, ఆటల పోటీలు, కోళ్ల పందేలు.. ఇలా పల్లెలన్నీ సంక్రాంతి శోభతో కళకళలాడుతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. దోపిడి మామూలే!

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తామనుకునే వారికి ప్రయాణ ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. రైలు, ఆర్టీసీ బస్సు, ప్రైవేటు వాహనం ఇలా.. సాధనం ఏదైనా భారీగా ఛార్జీలు సమర్పించుకోవాల్సిందే. రైల్వేలో నీరీక్షణ జాబితా పేరుతో.. ఆర్టీసీలో ప్రత్యేక ఛార్జీల రూపేణా... ప్రైవేటు వాహనాల్లో అదనపు మొత్తం పేరుతో దండుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. మత్తును వదిలించాల్సింది మీరే!

మత్తుమందులు కొనేందుకు డబ్బుల్లేక తొమ్మిదో తరగతి చదివే ఓ బాలిక ఏకంగా తన నగ్నచిత్రాలు అమ్మేందుకు సిద్ధపడింది. హైదరాబాద్‌ ఏఎస్‌ రావు నగర్‌కు చెందిన మరో ఇంజినీరింగ్‌ విద్యార్థేమో దొంగగా మారాడు. ముందు ఇంట్లో నగదు చోరీ చేసేవాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ఈ- బైక్​లకు ఆదరణ

దేశంలోని ప్రముఖ నగరాల్లో పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది. దిల్లీ లాంటి నగరాల్లోనైతే మరింత తీవ్రంగా ఉంటోంది. ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో డీజిల్ వాహనాలు పూర్తిగా నిషేధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. పాప లాకప్​ డెత్

మూడేళ్ల పాప లాకప్​డెత్​ అయ్యింది. వినడానికే నమ్మశక్యం కాని ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఓ కేసులో అరెస్టైన తన తల్లితో పాటే ఆ చిన్నారిని జైలుకు తరలించారు పోలీసులు. బాలిక మృతితో వందల సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. కాస్త జాగ్రత్త

యువతలో టాటూకి ఉన్న క్రేజే వేరు..! చాలా మంది సినీతారలు, క్రీడాకారులపై ఉన్న మక్కువతో వాళ్ల పేర్లు టాటూ వేయించుకుంటారు. అయితే పచ్చబొట్టు వేయించుకునే ముందు జాగ్రత్తలు మాత్రం తీసుకోరు. పదికాలాల పాటు పచ్చబొట్టు నిలవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. 8.5కోట్లు దాటిన కరోనా కేసులు

కొవిడ్​​ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఒక్కరోజే 5.1లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 8కోట్ల 55లక్షలకు పెరిగింది. కొత్తగా మరో 7,099 మంది మరణాలతో.. మృతుల సంఖ్య 1.08 కోట్లకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. హీరోగా సోనూసూద్

సోనూసూద్​ కథానాయకుడిగా తొలి చిత్రం ఖరారైంది. 'కిసాన్' పేరుతో ఈ సినిమా తీయనున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. సిడ్నీ టెస్టుపై కరోనా ఎఫెక్ట్

సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్టులో 25 శాతం సామర్థ్యంతో టికెట్లు విక్రయిస్తున్నట్లు సోమవారం క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రకటించింది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details