1. కొత్తగా 238 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ కొత్తగా 238 కేసులు వెలుగుచూశాయి. తాజాగా ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,106 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో మంటలు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో అగ్నిప్రమాదం జరిగింది. ఓపెన్ యార్డులో విద్యుత్ నియంత్రిక మరమ్మతు చేసి... కూలింగ్ ఉంచే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 10 వేలకు బదులు 4 వేలే
ఓ ఏటీఎంలో రూ.10 వేలు నమోదు చేస్తే రూ.4 వేలు, రూ.5 వేలకు రూ.2 వేలు వస్తుండటంతో వినియోగదారులు అవాక్కయిన ఘటన అమీర్‌పేటలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. తాడిపత్రిలో ఉద్రిక్తత
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద.. జేసీ ప్రభాకర్‌రెడ్డి మౌనదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పోలీసులు జేసీ సోదరులను గృహ నిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పెళ్లిలో వరుడు మాయం
తెల్లారితే పెళ్లి... అప్పటివరకు విందులో కలియతిరిగాడు పెళ్లికొడుకు నవీన్. అంతే.. ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. పొద్దునే వివాహం అని ఎదురుచూస్తున్న పెళ్లికూతురుని మనువాడేందుకు మరో నవవరుడు ముందుకొచ్చాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.