తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana top news: టాప్ న్యూస్@ 1PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana top news
Telangana top news

By

Published : Jan 3, 2023, 12:58 PM IST

  • దిల్లీ లిక్కర్ స్కామ్​లో నిందితులకు బెయిల్..

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్డిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.

  • ఆందోళన బాటలో మెట్రో సిబ్బంది..

హైదరాబాద్‌ మెట్రో టికెట్‌ కౌంటర్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. సరైన జీతాలు ఇవ్వడం లేదంటూ మియాపూర్-ఎల్బీ నగర్ కారిడార్‌లోని 27 స్టేషన్‌ల సిబ్బంది ధర్నాకు దిగారు. ఏజెన్సీ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమన్న ఉద్యోగులు స్పష్టం చేశారు.

  • భావ ప్రకటనపై సుప్రీం కీలక తీర్పు.. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ఆంక్షలు కుదరవ్!

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారికి ప్రత్యేక ఆంక్షలేమీ విధించలేమని స్పష్టం చేసింది.

  • విచారణకు హాజరుకావాలని.. సునీల్‌ కనుగోలుకు హైకోర్టు ఆదేశం..

పోలీసుల విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలును హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ కేసులో ఈనెల 8న విచారణకు రావాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సునీల్‌కు నోటీసులు ఇచ్చారు

  • ఏపీ రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములపై హైకోర్టు వ్యాఖ్యలు..

ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయింపు వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం, పిటిషనర్ల తీరును ఆక్షేపించింది. బెంచ్‌ హంటింగ్‌ చేస్తున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

  • యువతిని కారు ఈడ్చుకెళ్లిన కేసు.. మద్యం మత్తులో నిందితులు..

దిల్లీలో యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాద సమయంలో యువతి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై మరో యువతి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

  • దేశంలో తగ్గిన కరోనా కేసులు.. రెండో బూస్టర్ డోస్ తీసుకోవడంపై కేంద్రం క్లారిటీ!

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 134 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 88 మంది కోలుకున్నారు. మరోవైపు, కరోనా రెండో బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేశాయి.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరు వాహనాలు ఢీ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

  • తనకు సాయం చేసినవారితో మాట్లాడిన పంత్​..

కారు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అయితే అతడికి సంబంధించిన ఓ లేటెస్ట్​ ఫొటో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

  • అవతార్ 2కు కలెక్షన్ల పంట..

జేమ్స్​ కామెరున్​ తెరకెక్కించిన అవతార్-2 కలెక్షన్లలో దూసుకెళ్తోంది​. డిసెంబర్​లో విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్​ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details