తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana top news: తెలంగాణ టాప్ న్యూస్@ 11am - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana top news
Telangana top news

By

Published : Jan 3, 2023, 11:00 AM IST

  • నూతన సచివాలయం త్వరలో సిద్ధం.. 18న పూజలు..!

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న తెలంగాణ నూతన సచివాలయ భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈనెల 18వ తేదీలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. మొత్తం నిర్మాణం పూర్తికాకున్నా 18వ తేదీన పూజలు నిర్వహించేందుకు వీలుగా కొంత భాగాన్ని సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు.

  • 2023-24 ఎన్నికల బడ్జెట్‌ కసరత్తులో రాష్ట్ర సర్కార్ బిజీబిజీ..

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాలు పూర్తైన నేపథ్యంలో దాన్ని పరిగణలోకి తీసుకొని... రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తుకు ఆర్థికశాఖ సన్నద్ధమైంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు, గ్రాంట్లలో భారీగా తగ్గుదల, రుణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ... సొంత రాబడులు పూర్తి ఆశావహంగా, అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి.

  • పిటిషనర్‌ వాదనలు వినాలి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీం వ్యాఖ్య..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అవినీతి జరిగిందంటూ వేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఉత్తర్వులిచ్చే ముందు పిటిషనర్‌ వాదనలు వినాల్సి ఉందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

  • మూడెకరాలు పంచి ఇస్తే.. కట్టుబట్టలతో బయటకు పంపారు!

బిడ్డలను అల్లారుముద్దుగా పెంచిన ఆ తల్లిదండ్రులకు.. వృద్ధాప్యంలో ఆలనాపాలనా కరవైంది. సంపాదించిందంతా కొడుకులకు కట్టబెడితే.. చివరకు బుక్కెడు బువ్వ పెట్టడం లేదు. కాటికి కాలు చాచిన కన్నతల్లి అనారోగ్యంతో మంచం పట్టినా పట్టించుకునే నాథుడు లేడు.

  • ఏపీలో సభలు, ర్యాలీలు, రోడ్​షోలపై ప్రభుత్వం మార్గదర్శకాలు..

ఆంధ్రప్రదేశ్​లో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌షోలపై ఆ రాష్ట్ర సర్కార్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. గుంటూరు, కందుకూరు తొక్కిసలాట ఘటనల దృష్ట్యా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్టు నిబంధనలు వర్తింపజేశారు.

  • 'కన్నా.. నేను ఇక రాను.. బాగా చదువుకోండి..'

‘కన్నా.. ఇక మీదట మిమ్మల్ని చూడడానికి నేను రాను. మీరు మేడమ్‌ వాళ్లు చెప్పినట్లు విని బాగా చదువుకోండి..’ అని తల్లిని కోల్పోయి ఐసీడీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో ఉన్న నలుగురు బిడ్డలతో తండ్రి చెప్పిన చివరి మాటలివి. భవిష్యత్తును విస్మరిస్తూ సోమవారం ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరు వాహనాలు ఢీ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి..

మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

  • మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. ఏపీ, తెలంగాణలో ధరలు ఏంతంటే?

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • ద్రవిడ్ వారసుడిగా లక్ష్మణ్.. బీసీసీఐ నిర్ణయం ఏంటో మరి?

దాదాపు 12 ఏళ్ల నుంచి టీమ్‌ఇండియాకు ఐసీసీ ట్రోఫీని గెలవడం తీరని కలగా మిగిలిపోయింది. ధోనీ నాయకత్వంలో 2011లో భారత్‌ వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. అప్పుడు ప్రధాన కోచ్‌గా కిరిస్టెన్ ఉన్నాడు. ఇక ఆ తర్వాత కోచ్‌లు, కెప్టెన్లు మారినా కప్‌ మాత్రం దక్కలేదు. అయితే ప్రస్తుతం కోచ్​ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్ ద్రవిడ్​ ప్లేస్​లో మరో కోచ్​ పేరు వినిపిస్తోంది. అతడే మన 'వెరీ వెరీ స్పెషల్' లక్ష్మణ్!

  • రిలీజ్​కు ముందే 'ప్రాజెక్ట్​-కే' సంచలనాలు.. నిర్మాతకు కనక వర్షం!

నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ప్రాజెక్ట్​-కే. ఆదిపురుష్​, సలార్​ తర్వాత ప్రభాస్​ అప్​కమింగ్​ ప్రాజెక్ట్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ నయా అప్డేట్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేందంటే..

ABOUT THE AUTHOR

...view details