- నేడు హైదరాబాద్‌లో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం..
తెలంగాణకు చెందిన గూడెం, మొడికుంటవాగు ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నీటిలభ్యతపై అధ్యయనం అంశాలు అజెండాగా ఇవాళ హైదరాబాద్‌లో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. రెండు రాష్ట్రాల సరిహద్దు పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు, పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణ వంటి అంశాలపై ఈ భేటీలో చర్చ జరగనుంది.
- పిటిషనర్ వాదనలు వినాలి..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అవినీతి జరిగిందంటూ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఉత్తర్వులిచ్చే ముందు పిటిషనర్ వాదనలు వినాల్సి ఉందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
- గురుకులాల్లో 11 వేలకుపైగా పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో కలిపి.. ఒకేసారి 11 వేలకుపైగా పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాదికి మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మంత్రిమండలి ఆమోదించిన 2,591 ఖాళీ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి కోసం బోర్డు ఎదురుచూస్తోంది.
- 'జగన్ మామ వస్తుండని.. బడికి మళ్లీ సెలవు'
ఏపీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. ఏ జిల్లాలో.. ఏ ప్రాంతంలో పర్యటించినా.. ఆ చుట్టుపక్కల పాఠశాలలు అన్నీ ఆరోజు బంద్ అవుతాయి. జగన్ పర్యటన అంటే.. ఆ ప్రాంతంలో పిల్లలకు అధికారిక సెలవు అన్నమాటే. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా 1564 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవులు ప్రకటించారు.
- అప్పుడప్పుడు వనవాసం.. కంటినిండా నిద్ర.. కొత్త ఏడాదికి హెల్తీ రూల్స్!
కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, ఆశయాలను అందరూ ఏర్పరచుకుంటారు. వాటిని సాధించేందుకు ఆరోగ్యమే ముఖ్యమంటున్నారు నిపుణులు. అందుకు కొన్ని నిమయాలను సూచిసుస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
- పట్టపగలే యువకుడిని కాల్చి చంపిన దుండగులు.. సరిహద్దులో విదేశీ యువకుడి హత్య!