బీఆర్ఎస్లో చేరిన ఏపీ నేతలు AP Leaders joined in BRS: ఏపీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో ఏపీకి చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి తదితరులు ఉన్నారు. 8ఏళ్లలో రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరవాత విలువైన పెట్టుబడులు వచ్చాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఐటీ సంస్థలు వస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కృషితో లక్షలాది మందికి ఉపాధి లభించిందని అన్నారు. కేసీఆర్ బీహార్‌కు పారిపోవడం ఖాయం సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌కు అధికారం తాత్కాలికమేనని.. ఎల్లకాలం ఇలా ఉండదని స్పష్టం చేశారు. బీహార్‌తో కేసీఆర్‌కు రక్త సంబంధం ఉందని.. అందుకే బీఆర్ఎస్ అని పెట్టుకున్నారని వ్యంగాస్త్రాలు సంధించారు. సిట్ మెమో కొట్టివేతకు హైకోర్టు సమర్థనఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ మెమోను కొట్టివేయడాన్ని హైకోర్టు సమర్థించింది. బీఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాస్‌ను నిందితులుగా గతంలో సిట్ మెమో దాఖలు చేసింది. ముగ్గురిని నిందితులుగా చేర్చడాన్ని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపుదిల్లీ లిక్కర్ స్కాం కేసులోని నలుగురు నిందితులకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. ఈడీ విజ్ఞుప్తి మేరకు.. నిందితులకు ఈనెల 7 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దు సరైనదే .. సుప్రీంకోర్టు తీర్పుమోదీ సర్కారుకు ఊరట లభించింది. పెద్ద నోట్ల రద్దు సరైనదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్బీఐని సంప్రదించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నందున.. ఆ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ముఖ్యమంత్రుల ఇళ్ల సమీపంలో బాంబుపంజాబ్, హరియాణా ముఖ్యమంత్రుల అధికారిక నివాసాలకు సమీపంలో బాంబు కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. జైలుపై ముష్కరుల దాడి 14 మంది మృతిMexico Prison Attack : మెక్సికోలోని ఓ జైలులో కాల్పులు కలకలం సృష్టించాయి. ముష్కరులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. మిషన్ 2024 టార్గెట్.. రేపు జరగబోయే భారత్, శ్రీలంక టెస్టు మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సారి సీనియర్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో ఏలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఆ వివరాలు.. రష్యాలోనూ తగ్గేదేలే .. ఇటీవలే రష్యాలో విడుదలైన అల్లుఅర్జున్ పుష్ప అక్కడ కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందంటే?